సౌర ప్రాజెక్టులకు బిలియన్ డాలర్ల నిధులు | World Bank commits USD 1 bn for solar projects in India New Delhi | Sakshi
Sakshi News home page

సౌర ప్రాజెక్టులకు బిలియన్ డాలర్ల నిధులు

Jun 30 2016 4:12 PM | Updated on Oct 22 2018 8:31 PM

సౌర ప్రాజెక్టులకు బిలియన్ డాలర్ల  నిధులు - Sakshi

సౌర ప్రాజెక్టులకు బిలియన్ డాలర్ల నిధులు

ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యంగ్ కిమ్ గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీని కలిశారు.భార‌త్ లో రెండు రోజుల పాటు పర్యటనలో భాగంగా ఆయన ప్రధానిని, ఆర్థికమంత్రిని కలిశారు.

lన్యూఢిల్లీ:  ప్రపంచ  బ్యాంక్ అధ్యక్షుడు   జిమ్ యంగ్ కిమ్  గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని,  కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్  జైట్లీని కలిశారు.భార‌త్ లో రెండు రోజుల పాటు పర్యటనలో  భాగంగా ఆయన   ప్రధానిని, ఆర్థికమంత్రిని కలిశారు.   ఈ సందర్భంగా దేశంలో సోలార్ ప్రాజెక్టుల అభివృద్ధికి వేల కోట్ల రూపాయలను  ఫండింగ్ చేయనున్నట్టు  వ‌ర‌ల్డ్ బ్యాంక్ ప్రకటించింది.

 పోషణ, పునరుత్పాదక శక్తి  రంగాల్లో భారత ప్రభుత్వ పథకాలకు  మద్దతు అందించే  చర్యల్లో భాగంగా  ప్రపంచ బ్యాంక్ ప్రధానిని కలిసినట్టు పీఎంవో వర్గాలు ట్విట్ చేశాయి.  ప్రధాని కార్యాలయం ప్రధాన మంత్రి  తో  భేటీ అయిన కిమ్  ఫోటోను క ట్వీట్  చేశాయి. భారీ సౌర ఇంధన కార్యక్రమానికి  30 సోలార్ ప్రాజెక్టులకు ఒక బిలియన్ డాలర్ల  (6వేల 750 కోట్లను)  నిధులను  ఇవ్వనున్నట్టు ప్రపంచ బ్యాంకు ప్రకటించింది.  ఇంటర్నేషనల్ సోలార్  అలయన్స్(ఐఎస్ఎ)తో  దీనికి  సంబంధించి ఒక ఒప్పందాన్ని కదుర్చుకుంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలొ  ప్రపంచ బ్యాంక్ గ్రూప్ అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. దీని ప్రకారం ఐఎస్ఎ ఆర్థిక భాగస్వామిగా బహుపాక్షిక రుణ ఏజెన్సీ స్థాపిస్తుంది. క్లైమేట్ ఫ్రెండ్లీ భవిష్యత్తులో గ్లోబల్ ఉద్యమానికి ఇది దోహం చేస్తుందనే కిమ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా ఇండియాలో రెండు రోజుల  ప‌ర్యటన‌లో భాగంగా సోమవారం న్యూ ఢిల్లీలోని స్కిల్ ఇండియా సెంట‌ర్ ను  సంద‌ర్శించారు.  అనంతరం  ఆ త‌ర్వాత అంగ‌న్ వాడి సెంట‌ర్ కు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు.  అక్కడి  చిన్నారులతో సరదాగా ముచ్చటించినసంగతి తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement