‘లోయా మృతిపైనే మా విచారణ’ | Won't go into other aspects of judge Loya's death: Supreme Court | Sakshi
Sakshi News home page

‘లోయా మృతిపైనే మా విచారణ’

Feb 3 2018 3:41 AM | Updated on Oct 22 2018 8:17 PM

Won't go into other aspects of judge Loya's death: Supreme Court - Sakshi

న్యూఢిల్లీ: సీబీఐ దివంగత జడ్జి బీహెచ్‌ లోయా మృతికి సంబంధించి మాత్రమే తమ విచారణ ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్‌ లోయా అనుమానాస్పద మృతిపై తదుపరి విచారణకు ఆదేశించాలా? వద్దా? అనేదే పరిశీలిస్తామంది. సోహ్రబుద్దీన్‌ బూటకపు ఎన్‌కౌంటర్‌ చేసిన కేసులో బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు, నాటి గుజరాత్‌ హోం మంత్రి అమిత్‌ షాను నిర్దోషిగా ప్రకటించడం సహా...మరే ఇతర అంశాల జోలికి తాము వెళ్లబోమని తేల్చిచెప్పింది. అమిత్‌ షా నిందితుడిగా ఉండిన సోహ్రబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసును విచారిస్తుండగానే 2014 డిసెంబర్‌ 1న లోయా అనుమానాస్పద స్థితిలో గుండెపోటుతో మరణించారు.

Advertisement
 
Advertisement
Advertisement