సరి-బేసి విధానంపై ప్రభుత్వానికి చురకలు

Women, 2-wheelers not exempt: NGT turns down Delhi govt plea on odd-even - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకు కాలుష్యం, పొగమంచు విపరీతంగా పెరిగిపోతుంది. ఈ కాలుష్యాన్ని అదుపులో ఉంచేందుకు  ఢిల్లీ ప్రభుత్వం సరి-బేసి విధానంతో ముందుకొచ్చింది. కానీ దీన్ని అమలు చేయడంలోనే జాప్యం జరుగుతోంది. ఈ విధానం నుంచి మహిళలను, టూ-వీలర్స్‌ను మినహాయించాలని ప్రభుత్వం కోరుతుండగా.. ఎట్టిపరిస్థితుల్లోనూ అందరికీ ఈ పాలసీని అమలు చేయాల్సిందేనని నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యూనల్‌ తీర్పునిచ్చింది. ఈ విషయంపై మరోసారి ఎన్‌జీటీని ప్రభుత్వం ఆశ్రయించగా.. మరోసారి కూడా ఢిల్లీ ప్రభుత్వ అభ్యర్థనను ఈ ట్రైబ్యూనల్‌ కొట్టివేసింది. మహిళలను, టూ-వీలర్స్‌ను కూడా ఈ విధానం నుంచి మినహాయించే పరిస్థితి లేదని తేల్చిచెప్పింది. 

కేవలం ఎమర్జెన్సీ వాహనాలకు మాత్రం ఈ విధానం నుంచి మినహాయింపు ఇవ్వాలని ఎన్‌జీటీ ఆదేశాలు జారీచేసింది. సరి-బేసి విధాన రోజుల్లో ట్రాన్స్‌పోర్టు సమస్యను పరిష్కరించడానికి కేవలం మహిళ కోసం బస్సులు ఎందుకు నడపడం లేదంటూ ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఫోర్‌-వీలర్స్‌ కంటే టూ-వీలర్సే ఎక్కువ కాలుష్య కారకాలను విడుదల చేస్తాయని, ఇది తెలిసి కూడా ప్రభుత్వం ఎందుకు టూ-వీలర్స్‌కు మినహాయింపు కోరుతుందో తెలియడం లేదంది. ఇదేమనా జోకా? అంటూ మండిపడింది. ఏజెన్సీ రిపోర్టుల ప్రకారం ప్రభుత్వం తన పిటిషన్‌లో మార్పుల కోసం తన ఫిర్యాటును విత్‌డ్రా చేసుకున్నట్టు తెలిసింది.    

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top