వివాహితను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ | Woman abducted from train and gangraped in Jharkhand | Sakshi
Sakshi News home page

వివాహితను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్

Mar 12 2016 3:02 PM | Updated on Oct 4 2018 8:29 PM

వివాహితను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ - Sakshi

వివాహితను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్

జార్ఖండ్ లోని దేవ్ గఢ్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.

దేవ్ గఢ్: జార్ఖండ్ లోని దేవ్ గఢ్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రైలులో ప్రయాణిస్తున్న ఓ వివాహితను కొందరు గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేసి, ఆ తర్వాత సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ దారుణ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఓ వివాహిత(25), తండ్రితో కలిసి గురువారం గిరిద్-మాదాపూర్ ప్యాసింజర్ రైళ్లో ప్రయానిస్తోంది. రైలు మాదాపూర్ రైల్వే స్టేషన్ వద్దకు రాగానే రైళ్లో ప్రయాణిస్తోన్న ఆరుగురు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేశారని రైల్వే ఎస్పీ అసీమ్ విక్రాంత్ మింజ్ తెలిపారు.

మాదాపూర్ స్టేషన్ వద్దకు రైలు రాగానే ఆయనకు మెలకువ వచ్చింది. ఎంత వెతికినా కూతురు కనిపించకపోవడంతో రైల్వే పోలీసులకు ఆమె తండ్రి ఫిర్యాదుచేశాడు. కిడ్నాప్ జరిగిన సమయంలో కూతురు కూడా నిద్రలో ఉన్నట్లు ఫిర్యాదులో ఆమె తండ్రి పేర్కొన్నాడు. విచారణ చేపట్టిన పోలీసులు దంగల్ పుర ప్రాంతంలో అత్యాచారానికి గురైన ఓ మహిళను గుర్తించినట్లు చెప్పారు. బాధిత మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. వివాహితను గ్యాంగ్ రేప్ చేసిన నిందితులలో ముగ్గురిని అరెస్ట్ చేశామని, మిగతా ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement