వ్యక్తిగత ఆరోగ్యంతోనే స్వచ్ఛ భారత్: సచిన్ | With the freedom of the individual's health in India: Sachin | Sakshi
Sakshi News home page

వ్యక్తిగత ఆరోగ్యంతోనే స్వచ్ఛ భారత్: సచిన్

Oct 13 2014 1:58 AM | Updated on Sep 2 2017 2:44 PM

వ్యక్తిగత ఆరోగ్యంతోనే స్వచ్ఛ భారత్: సచిన్

వ్యక్తిగత ఆరోగ్యంతోనే స్వచ్ఛ భారత్: సచిన్

ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా మారడం ద్వారా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేయాలని ప్రముఖ మాజీ క్రికెటర్ సచిన్

న్యూఢిల్లీ: ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా మారడం ద్వారా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేయాలని ప్రముఖ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కోరారు. బహిరంగ క్రీడలు తప్పనిసరన్నారు. పరిశుభ్ర భారత్‌ను ఆవిష్కరించేందుకు ప్రధాని మనకు  స్వచ్ఛ  భారత్ పిలుపునిచ్చారని... అందరూ ఆరోగ్యంగా ఉండాలని తాను కోరుతున్నట్లు సచిన్ పేర్కొన్నారు.

ఆదివారం ఢిల్లీలో సీఆర్పీఎఫ్ చేపట్టిన ‘హాఫ్ మారథాన్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం సచిన్ మాట్లాడారు. పరిశుభ్రమైన పరిసరాలు, ఆరోగ్యకరమైన దేహం జాతిని పటిష్టంగా ఉంచుతుందన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement