6 యూనివర్సిటీలు.. 69 కాలేజీలకు 'వై-ఫై' | Wi-Fi facilities in 6 universities, 69 colleges of Odisha | Sakshi
Sakshi News home page

6 యూనివర్సిటీలు.. 69 కాలేజీలకు 'వై-ఫై'

Mar 5 2015 4:32 PM | Updated on Sep 2 2017 10:21 PM

6 యూనివర్సిటీలు.. 69 కాలేజీలకు 'వై-ఫై'

6 యూనివర్సిటీలు.. 69 కాలేజీలకు 'వై-ఫై'

సాంకేతిక పరిజ్ఞానాన్ని యూనివర్శిటీలకు, కళాశాలలకు అందుబాటులోకి తెచ్చేలా ఒడిశా ప్రభుత్వం తొలిదశలో భాగంగా స్మార్ట్ క్యాంపస్ పథకం అమలు చేయనుంది.

ఇంటర్ నెట్ సౌకర్యాన్ని యూనివర్సిటీలు, కళాశాలలకు అందుబాటులోకి తెచ్చేలా ఒడిశా ప్రభుత్వం స్మార్ట్ క్యాంపస్ పథకం అమలు చేస్తోంది. దీనికోసం రూ. 20కోట్లను ఖర్చు చేయనుంది. ఇందులో భాగంగా 6 యూనివర్సిటీలకు, 46 ప్రభుత్వ కళాశాలలు, 23 ప్రైవేటు కళాశాలల్లో వై-ఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తేనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.

అంతేకాక విద్యాసంస్థలలో అత్యాధునిక స్మార్ట్ క్లాస్ రూంలు, ఈ లైబ్రరీ, కమ్యూనికేషన్ లాంగ్వేజ్ లాబొరేటరీల వంటి సదుపాయాలను వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలులోకి తేనున్నట్టు ఉన్నతా విద్యాశాఖ మంత్రి ప్రదీప్ కుమార్ పాణిగ్రహి తెలిపారు. గురువారం ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సౌకర్యాలను మరొకొన్ని యూనివర్సిటీలు, కాలేజీలకు విస్తరించనున్నట్టు ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్ట్కు నిర్వహణ బాధ్యతలను బీఎస్ఎన్ఎల్ అధికారులు చేపట్టనున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలలో సర్వే ప్రారంభమైనట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement