ఆర్మీ జీప్‌పై కట్టేశారు! | why a man was tied to an Indian Army jeep in Kashmir | Sakshi
Sakshi News home page

ఆర్మీ జీప్‌పై కట్టేశారు!

Apr 15 2017 1:36 AM | Updated on Sep 5 2017 8:46 AM

ఆర్మీ జీప్‌పై కట్టేశారు!

ఆర్మీ జీప్‌పై కట్టేశారు!

జమ్మూ కశ్మీర్‌లో ఆర్మీ జీప్‌నకు ఓ పౌరుడిని కట్టివేసిన ఘటనపై విచారణ జరుపుతున్నామని ఆర్మీ ప్రతినిధులు తెలిపారు.

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లో ఆర్మీ జీప్‌నకు ఓ పౌరుడిని కట్టివేసిన ఘటనపై విచారణ జరుపుతున్నామని ఆర్మీ ప్రతినిధులు తెలిపారు. శ్రీనగర్‌ లోక్‌సభ స్థానానికి గత ఆదివారం పోలింగ్‌ జరగ్గా, ఆందోళనకారులు హింసకు దిగి భద్రతా సిబ్బందిపై రాళ్లు రువ్వడం తెలిసిందే.

ఆ సమయంలో 53 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన సిబ్బంది...ఆందోళనకారులు రాళ్లు తమవైపు విసరకుండా ఉండేందుకు, ఫరూక్‌దార్‌ అనే వ్యక్తిని రక్షణ కవచంలా తమ జీప్‌నకు ముందువైపు కట్టివేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలోకి రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బాధితుడు ఫరూక్‌ మాట్లాడుతూ తాను ఓటు వేసి తన సోదరి ఇంటికి వెళ్తుండగా ఆర్మీ సిబ్బంది తనను పట్టుకుని జీప్‌పై కట్టేసి 10 నుంచి 12 గ్రామాలకు తిప్పారని చెప్పాడు.

Advertisement
 
Advertisement
Advertisement