breaking news
Army Jeep
-
పరేష్ రావెల్ సంచలన ట్వీట్
ముంబై: సీనియర్ నటుడు పద్మ శ్రీ అవార్డు గ్రహీత, బీజేపీ ఎంపీ పరేష్ రావల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గత రాత్రి ట్విట్టర్లో ప్రముఖ రచయిత, రాజకీయ కార్యకర్త అరుంధతి రాయ్‌పై అనుచిత వ్యాఖ్యలకు దిగాడు. ఇటీవల జమ్ముకశ్మీర్ ఉద్రిక్త పరిస్థితులపై స్పందించిన ఆయన కశ్మీర్లో రాళ్లు విసిరే యువకుడికి బదులుగా అరుంధతిరాయ్‌ను ఆర్మీ జీప్‌కు కట్టాలని ట్వీట్ చేశాడు. దీంతో దుమారం చెలరేగింది. పరేస్ రావెల్ వ్యాఖ్యలపై ట్విట్టర్లో మండిపడుతున్నారు. కాగా 2014 సాధారణ ఎన్నికల్లో అహ్మదాబాద్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి పరేష్ రావల్ పార్లమెంటుకు ఎంపికయ్యారు.శ్రీనగర్ ఉప ఎన్నిక సందర్భంగా సెంట్రల్ కాశ్మీర్‌లోని బుద్గం జిల్లాలోని ఒక గ్రామంలో తమపై దాడి జరపకుండా, ఓ వ్యక్తిని జీపు ముందు భాగానికి కట్టి తీసుకుపోయిన భద్రతా దళాలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలింగ్ ఆఫీసర్లను చుట్టుముట్టి రాళ్లదాడికి నిరసనకారులు పాల్పడుతున్న వేళ, వారికి రక్షణ కోసం ఓ స్థానిక యువకుడిని జీపు ముందు భాగానికి కట్టి తీసుకెళ్లారు. అయితే తాను తన చెల్లెలి ఇంటికి వెళుతుంటే, అడ్డగించిన జవాన్లు, తనను బలవంతంగా తీసుకెళ్లి జీపుకు కట్టేశారని, నిరసనకారులతో, రాళ్లు రువ్వే వారితో తనకు సంబంధం లేదని అహ్మద్ విచారణలో పోలీసులకు తెలిపారు. ఇటీవల ఈ వీడియో ఒకటి వైరల్ గా మారింది. పలు విమర్శలు చెలరేగాయి.ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ ప్రతిపక్ష నాయకుడు ఒమర్ అబ్దుల్లా ఏప్రిల్‌లో వీడియోను ట్వీట్ చేస్తూ తక్షణ విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. Instead of tying stone pelter on the army jeep tie Arundhati Roy ! — Paresh Rawal (@SirPareshRawal) May 21, 2017 -
ఆర్మీ జీప్‌పై కట్టేశారు!
-
ఆర్మీ జీప్‌పై కట్టేశారు!
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో ఆర్మీ జీప్‌నకు ఓ పౌరుడిని కట్టివేసిన ఘటనపై విచారణ జరుపుతున్నామని ఆర్మీ ప్రతినిధులు తెలిపారు. శ్రీనగర్ లోక్‌సభ స్థానానికి గత ఆదివారం పోలింగ్ జరగ్గా, ఆందోళనకారులు హింసకు దిగి భద్రతా సిబ్బందిపై రాళ్లు రువ్వడం తెలిసిందే. ఆ సమయంలో 53 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన సిబ్బంది...ఆందోళనకారులు రాళ్లు తమవైపు విసరకుండా ఉండేందుకు, ఫరూక్‌దార్ అనే వ్యక్తిని రక్షణ కవచంలా తమ జీప్‌నకు ముందువైపు కట్టివేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలోకి రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బాధితుడు ఫరూక్ మాట్లాడుతూ తాను ఓటు వేసి తన సోదరి ఇంటికి వెళ్తుండగా ఆర్మీ సిబ్బంది తనను పట్టుకుని జీప్‌పై కట్టేసి 10 నుంచి 12 గ్రామాలకు తిప్పారని చెప్పాడు.