మీడియాతో నరసింహన్ చమత్కారం | we discuss national, internaltion news, says governor narasimhan | Sakshi
Sakshi News home page

మీడియాతో నరసింహన్ చమత్కారం

Aug 8 2015 12:36 PM | Updated on Aug 21 2018 11:41 AM

మీడియాతో నరసింహన్ చమత్కారం - Sakshi

మీడియాతో నరసింహన్ చమత్కారం

రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వివాదాలు త్వరలోనే పరిష్కారమవుతాయని గవర్నర్‌ నరసింహన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

న్యూఢిల్లీ : రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వివాదాలు త్వరలోనే పరిష్కారమవుతాయని గవర్నర్‌ నరసింహన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న  ఆయన శనివారం ఉదయం  కేంద్ర హోం శాఖ కార్యదర్శితో భేటీ అయ్యారు.  ఏ అంశాలను హోం శాఖ కార్యదర్శితో మాట్లాడారన్న మీడియా ప్రశ్నలకు గవర్నర్‌ సమాధానం చెప్పడానికి నిరాకరించారు.  జాతీయ, అంతర్జాతీయ విషయాలు చర్చించామని గవర్నర్‌ చమత్కరించారు. కాగా కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్తో కూడా గవర్నర్ భేటీ కానున్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement