మోడీ కర్మయోగి, వికాస పురుషుడు: వివేక్ ఒబెరాయ్ | Vivek Oberoi supports Narendra Modi, calls him karma yogi | Sakshi
Sakshi News home page

మోడీ కర్మయోగి, వికాస పురుషుడు: వివేక్ ఒబెరాయ్

Apr 21 2014 2:30 PM | Updated on Mar 29 2019 9:24 PM

మోడీ కర్మయోగి, వికాస పురుషుడు: వివేక్ ఒబెరాయ్ - Sakshi

మోడీ కర్మయోగి, వికాస పురుషుడు: వివేక్ ఒబెరాయ్

బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడీకి బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ మద్దతు తెలిపారు. మోడీని కర్మయోగి, వికాస్ పురుష్ అని వివేక్ కితాబిచ్చారు.

ముంబై: బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడీకి బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ మద్దతు తెలిపారు. మోడీని కర్మయోగి, వికాస్ పురుష్ అని వివేక్ కితాబిచ్చారు. దేశానికి మోడీ సేవలు ఎంతో అవసరమని వివేక్ తెలిపారు. గుజరాత్ లో అభివృద్ది చూపిన నేత అని బాలీవుడ్ నటుడు ప్రశంసలతో ముంచెత్తారు. 
 
గుజరాత్ లో 18 వేల గ్రామాలకు విద్యుత్ సౌకర్యాన్ని అందించారన్నారు.  మోడీ తక్కువ మాట్లాడుతారని.. ఎక్కువ పనిచేస్తారని ఆయన అన్నారు. బాలీవుడ్ లో ప్రతి ఒక్కరు మోడీకి ఓటు వేయాలని వ్యక్తిగతం అభ్యర్థిస్తున్నానని వివేక్ తెలిపారు. 
 
రాజకీయాలను, సిద్దాంతాలన్నింటిని పక్కన పెట్టి హిందు, ముస్లీం, దళితులు ఓటు వేయాలన్నారు. ముంబైలో ఏప్రిల్ 24 తేదిన ఎన్నికల జరుగనున్నాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement