ఐఐటీల్లో ప్రొఫెసర్ల కొరత: విజయ సాయిరెడ్డి | Vijayasai reddy seeks to form IIT courses national wide | Sakshi
Sakshi News home page

ఐఐటీల్లో ప్రొఫెసర్ల కొరత: విజయ సాయిరెడ్డి

Aug 3 2016 5:04 AM | Updated on Aug 9 2018 2:44 PM

ఐఐటీల్లో ప్రొఫెసర్ల కొరత: విజయ సాయిరెడ్డి - Sakshi

ఐఐటీల్లో ప్రొఫెసర్ల కొరత: విజయ సాయిరెడ్డి

దేశవ్యాప్తంగా అన్ని ఐఐటీలను బలోపేతం చేయాలని వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి కోరారు.

ఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని ఐఐటీలను బలోపేతం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి కోరారు. ఆయన మంగళవారం రాజ్యసభలో మాట్లాడుతూ .. ఐఐటీల్లో కాంట్రాక్ట్ పద్దతిలో కాకుండా శాశ్వత పద్ధతిలో నియామకాలు చేపట్టాలన్నారు. ఒక్కో ఐఐటీకి ఒక డైరెక్టర్ నియమించాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో ఐఐటీకి రూ. 1,750 కోట్లు అవసరమైతే ఇప్పటివరకూ కేవలం రూ. 60 కోట్లు మాత్రమే విడుదల చేశారని ఆయన అన్నారు.

ప్రస్తుతం తిరుపతి ఐఐటీలో నాలుగు కోర్సులు మాత్రమే ఉన్నాయని విజయ సాయిరెడ్డి అన్నారు. కోర్సులు, విద్యార్థుల సంఖ్యను పెంచాలని సూచించారు. తిరుపతి ఐఐటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, రీసెర్చ్ ప్రోగ్రామ్లను కూడా ప్రారంభించాలని  ఆయన  కోరారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement