
ఏపుగా పెరగాలంటే... మూత్రం పోయాలి
మొక్కలు ఏపుగా పెరగాలంటే వాటికి మానవ మూత్రాన్ని పోయాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ అన్నారు.
ముంబై: మొక్కలు ఏపుగా పెరగాలంటే వాటికి మానవ మూత్రాన్ని పోయాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ అన్నారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలోని పెరట్లో కొన్ని మొక్కలకు తన మూత్రాన్ని ప్రయోగాత్మకంగా పోస్తున్నానని, నీటిని పట్టే మొక్కలకంటే ఇవి ఒకటిన్నర రెట్లు ఏపుగా పెరుగుతున్నాయని చెప్పారు.
మూత్రంలో యూరియా, నైట్రోజన్ ఉంటాయని... ఇవి మొక్కల ఎదుగుదలకు ఉపకరిస్తాయన్నారు. యాభై లీటర్ల క్యానులో తన మూత్రాన్ని నిల్వచేసి మొక్కలకు పోస్తున్నట్లు తెలిపారు. నాగ్‌పూర్‌లో సోమవారం ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ గడ్కారీ ఈ విషయాన్ని చెప్పారు.