‘చైనా రెస్టారెంట్లను బాయ్‌కాట్‌ చేయండి’ | Union minister Ramdas Athawale fires on China | Sakshi
Sakshi News home page

చైనా రెస్టారెంట్లను బాయ్‌కాట్‌ చేయండి : కేంద్ర మంత్రి

Jun 18 2020 3:49 PM | Updated on Jun 18 2020 5:05 PM

Union minister Ramdas Athawale fires on China - Sakshi

న్యూఢిల్లీ : గాల్వన్‌ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోవడంపై కేంద్ర మంత్రి రామ్‌ దాస్‌ అథావలే చైనాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనీస్ ఫుడ్‌ను విక్రయించే రెస్టారెంట్లపై భారత్‌లో నిషేధం విధించాలని డిమాండ్ చేశారు.(భారత సైన్యంపై చైనా నిందలు)

అన్యాయంగా 20 మంది భారత జవాన్లను చైనా పొట్టనపెట్టుకుందని మండిపడ్డారు. ప్రజలంతా స్వచ్ఛందంగా చైనా ఆహార పదార్థాలను, వాటిని అమ్మే రెస్టారెంట్లను బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చారు. ఆహార పదార్థాలే కాకుండా, చైనాలో తయారైన అన్ని రకాల వస్తువులను వదిలించుకోవాల్సిన సమయం వచ్చిందని ట్విటర్‌లో పేర్కొన్నారు.(చైనాతో దౌత్య యుద్ధం చేయాల్సిందే!)

Advertisement
 
Advertisement
Advertisement