భారత సైన్యంపై చైనా నిందలు

China blames India again says troops deliberately provoked - Sakshi

బీజింగ్‌ : భారత్‌-చైనా సరిహద్దులోని గాల్వన్‌ లోయలో చోటుచేసుకున్న హింసాత్మక ఘర్షణపై డ్రాగన్‌ అసత్యాలు ప్రచారం చేస్తోంది. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ)ని మొదటి భారత సైనికులు దాటారంటూ ఆరోపణలుకు దిగింది. కుట్రపూరితంగానే భారత సైనికులు తమ ఆర్మీపై భౌతిక దాడికి పాల్పడ్డారంటూ నిందలు మోపింది. ఈ మేరకు గురువారం చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ ఓ ప్రకటన విడుదల చేశారు. వాస్తవాధీన రేఖ వెంట చైనా ఆర్మీ సంయమనం పాటిస్తోందని, భారత సైనికులు దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నారంటూ బుకాయించారు. సరిహద్దు వివాదాలపై ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత కూడా భారత సరిహద్దు దళాలు నిబంధనలు ఉల్లంఘించాయని ఆరోపించారు. (భారత్‌ను దెబ్బతీసేందుకు చైనా జిత్తులు)

కాగా గాల్వన్‌ లోయ ఘర్ణణ అనంతరం కూడా ఆ ప్రాంతం తమదేనంటూ చైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసింది. ఈ వివాదం ముగియక ముందే భారత సైన్యంపై మరోసారి విషంకక్కింది. ఇక సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పేందుకు ఇరు దేశాల మేజర్‌ జర్నల్‌ స్థాయి అధికారులు గురువారం సమావేశం అయ్యారు. కాగా తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ ప్రాంతంలో ఇరు దేశాల సైనికుల మధ్య సోమవారం రాత్రి తీవ్రస్థాయిలో హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్న విషయం విదితమే. ఈ ఘటనలో 20 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. (చైనా మరో దాష్టీకం.. లీకైన డాక్యుమెంట్లు)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top