ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు: జవాన్లకు గాయాలు | Two security personnel injured in blast triggered by naxals in Chhattisgarh | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు: జవాన్లకు గాయాలు

Nov 21 2016 2:54 PM | Updated on Apr 3 2019 3:52 PM

తెలంగాణ సరిహద్దుల్లో సోమవారం జరిగిన పేలుడులో ఇద్దరు జవాన్లు గాయాలపాలయ్యారు.

భద్రాచలం: తెలంగాణ సరిహద్దుల్లో సోమవారం జరిగిన పేలుడు ఘటనలో ఇద్దరు జవాన్లు గాయాలపాలయ్యారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా చింతలనార్ సమీపంలో కూంబింగ్ చేస్తున్న జవాన్లే లక్ష్యంగా మావోయిస్టులు పేలుళ్లు జరిపారు. రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో జరిగిన పేలుడులో 74వ బెటాలియన్‌కు చెందిన ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement