క్రికెటర్ భార్య స్లీవ్ లెస్ వేసుకుందని.. | Twitter rises to defend Mohammed Shami, wife after Muslim fanatics trolled him over wife's attire | Sakshi
Sakshi News home page

క్రికెటర్ భార్య స్లీవ్ లెస్ వేసుకుందని..

Dec 26 2016 8:45 AM | Updated on Sep 4 2017 11:39 PM

క్రికెటర్ భార్య స్లీవ్ లెస్ వేసుకుందని..

క్రికెటర్ భార్య స్లీవ్ లెస్ వేసుకుందని..

భారత పేస్ బౌలర్ మొహమ్మద్ షమీకి ఓ చేదు అనుభవం ఎదురైంది.

భారత పేస్ బౌలర్ మొహమ్మద్ షమీకి ఓ చేదు అనుభవం ఎదురైంది. తన భార్య హసిన్ జహాన్తో కలిసి దిగిన ఓ ఫోటోను సరదాగా ఫేస్ బుక్లో పోస్ట్ చేశాడు. అందులో హసిన్ జహాన్ స్లీవ్ లెస్ గౌను ధరించి ఉంది. ఇంకే ముంది కొంతమంది నెటిజన్లు రెచ్చిపోయారు. షమీ నువ్వు అసలైన ముస్లింవేనా అంటూ కామెంట్ల వర్షం కురిపించారు. మరో వైపు మరికొందరు ముస్లింలు షమీకి అండగా నిలిచారు. వీరిలో సీనియర్ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ కూడా ఉన్నారు.


'ఇలాంటి వ్యాఖ్యలు చాలా సిగ్గుపడేలా ఉన్నాయి.  మొహమ్మద్ షమీకి నా మద్దతు ఉంటుంది. దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. నేను చెప్పదలచుకున్నది అర్థమయ్యి ఉంటుందని భావిస్తున్నా' అని  మొహమ్మద్ కైఫ్ ట్విట్ చేశాడు. ఎవరి ఇష్టం వచ్చిన దుస్తులు వారు ధరిస్తారు మీ పని మీరు చూసుకోండంటూ దుస్తులపై కామెంట్లు చేసిన వారిపై నెటిజన్లు షమీకి బాసటగా నిలిచారు.

ట్విట్టర్, ఫేస్బుక్ పేజీలో ఫోటోలను షమీ పోస్ట్ చేసినా, రెండింట్లో విభిన్నంగా కామెంట్లు వచ్చాయి. ఫేస్ బుక్లో ఎక్కువగా దుస్తులకు వ్యతిరేకంగా కామెంట్లు వస్తే ట్విట్టర్లో మాత్రం ఫోటోలు బాగున్నాయంటూ, ఇండియన్ ముస్లింలు మీలాగే ఉండాలని భావిస్తున్నామంటూ.. ఎక్కువగా కామెంట్లు రావడం గమనార్హం.

 

Advertisement
 
Advertisement
Advertisement