అక్షయ్‌ అవి వేసుకుంటే నచ్చవు : ట్వింకిల్‌

Twinkle Khanna hates Akshay Kumar in track pants - Sakshi

ట్వింకిల్‌ ఖన్నా తన భర్త అక్షయ్‌ కుమార్‌ గురించి ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారు. ఇటీవలె మీడియా సంధించిన ప్రశ్నలకు ఈ జంట ఇచ్చిన సమాధానాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. తన భర్త రెడీ అవ్వడానికి తక్కువ సమయం తీసుకుంటాడని, తన వద్ద కంటే భర్త వద్దే ఎక్కువ షూస్‌, బట్టలు ఉంటాయని ట్వింకిల్‌ పేర్కొన్నారు. ఇంతకీ మీడియాతో జరిగిన సంభాషణ ఏంటంటే..

‘మీ దుస్తుల ఎంపికపై ట్వింకిల్‌ ప్రభావమేమైనా ఉంటుందా?’ అని అక్షయ్‌ను ప్రశ్నించగా..నూరుశాతం ఉంటుందని! చెప్పారు. దానికి ఏకీభవించని ట్వింకిల్‌ ‘ఎట్టి పరిస్థితిల్లోనూ కాదు’’ అని జవాబిచ్చారు. దానికి కొనసాగింపుగా.. తన వద్దే ఎక్కువ షూలు ఉంటాయని, అన్ని రంగుల (పింక్‌, గ్రీన్‌, లైలాక్‌, ఊదా) ప్యాంట్లు ఉంటాయని చెప్పారు. దానికి అక్షయ్‌.. ‘అవన్నీ నువ్వు చెబితేనే కొన్నాను కదా?’ అని అన్నారు. ‘‘హా.. కొనమన్నాను కానీ ఇంద్రధనస్సులో ఉండే రంగులన్నీ కొనమనలేదు’ అని బదులిచ్చారు.

‘మీ ఇద్దరిలో రెడీ కావడానికి ఎవరెక్కువ సమయం తీసుకుంటార’ని ప్రశ్నించగా.. దానికి ట్వింకిల్‌ సమాధానమిస్తూ.. ‘నేనే ఎక్కువ సమయం తీసుకుంటాను, అతని బట్టలకు ఓ ప్రత్యేకమైన గది ఉంటుంది. అతని ఫ్యాషన్‌ తగ్గట్టుగా ఆ రూమ్‌ ఉంటుంది. తను రెడీ అవ్వడానికి సహయకులు 11మంది ఉంటారు. నాకు ఎవరూ ఉండరు. అందుకే నాకు కొంచెం ఎక్కువ సమయం పడుతుంది’ అని అన్నారు.

అక్షయ్‌ వేసుకునే ట్రాక్‌ ప్యాంట్లు, హుడీస్‌  తనకే మాత్రం నచ్చవనే  విషయాన్ని బయటపెట్టారు. దీనికి అక్షయ్‌.. ‘నేను వేసుకునే ట్రాక్‌ ప్యాంట్లు, హుడీస్‌ తనకు ఏమాత్రం నచ్చవని, కానీ తనకు నేను అర్థమయ్యేలా చెబుతూనే ఉంటాను. ప్రతీరోజు నాది ఉరుకులు పరుగులతో కూడిన జీవితం కనుక అవి నాకు ఇంట్లో సౌకర్యవంతంగా ఉంటాయి. అందుకే నేను ఆ దుస్తులు వేసుకొవటానికే ఇష్టపడతాను’ అని చెప్పగా.. ట్వింకిల్‌  మాట్లాడుతూ.. ‘నేను చెప్పాల్సినవి ఇంకా చాలానే ఉన్నాయి కానీ నేను కంట్రోల్‌ చేసుకుంటున్నాను’ అని అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top