శతాబ్ది రైళ్లలో వేగంగా ప్రయాణించడమే కాదు... ఇకపై ఐపీఎల్ ట్వంటీ 20 మ్యాచ్‌ను ఆసక్తికరంగా వీక్షిస్తూ అది అయిపోయేలోపే గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు.
న్యూఢిల్లీ: శతాబ్ది రైళ్లలో వేగంగా ప్రయాణించడమే కాదు... ఇకపై ఐపీఎల్ ట్వంటీ 20 మ్యాచ్‌ను ఆసక్తికరంగా వీక్షిస్తూ అది అయిపోయేలోపే గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు. ఇష్టమైన సంగీతాన్ని వింటూ ప్రయాణిస్తున్న విషయాన్నీ మరచిపోవచ్చు దేశంలోనే తొలిసారిగా శతాబ్ది రైళ్లలో ప్రతీ సీటు వెనుక భాగంలో ఎల్‌సీడీ టీవీలను ఏర్పాటు చేయడానికి రైల్వే శాఖ సమయాత్తం అవుతోంది.
వీటి ద్వారా 80 చానళ్ల వరకూ చూసే అవకాశం ఉంటుంది. అలాగే సంగీతాన్ని కూడా వినవచ్చు. ముందుగా కల్కా శతాబ్ది, లక్నో, అమృత్‌సర్, కాన్పూర్, అజ్మీర్, భోపాల్, డెహ్రాడూన్ శతాబ్ది రైళ్లలో ఈ సదుపాయాన్ని కల్పించనున్నట్లు రైల్వే అధికార వర్గాలు తెలిపాయి. ఈ ప్రాజెక్టును ఈ నెల 29 నాటికి ఖరారు చేయనున్నట్లు వెల్లడించాయి.