హిమాచల్‌లో నేడే పోలింగ్‌ | today Himachal Pradesh Assembly Elections 2017 | Sakshi
Sakshi News home page

హిమాచల్‌లో నేడే పోలింగ్‌

Nov 9 2017 4:02 AM | Updated on Nov 9 2017 4:02 AM

today Himachal Pradesh Assembly Elections 2017 - Sakshi

సిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకు పోలింగ్‌ గురువారం జరగనుంది. మొత్తం 68 స్థానాలకుగాను 338 మంది అభ్యర్థులు తుది బరిలో నిలిచారు. వీరిలో మహిళా అభ్యర్థులు కేవలం 19 మంది ఉండటం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 50.25 లక్షల మంది ఓటర్లు, 7,525 పోలింగ్‌ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ మొత్తం 68 స్థానాల్లోనూ పోటీ పడుతుండగా, బీఎస్పీ 42, సీపీఎం 14 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టాయి.

Advertisement
 
Advertisement
Advertisement