
కోర్టు బయట కాల్పులు.. ముగ్గురి మృతి
హజారీబాగ్ జిల్లా కోర్టు ఆవరణలో మంగళవారం ఒక ముఠా నాయకుడిపై, అతని అనుచరులపై ప్రత్యర్థి ముఠా జరిపిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు.
హజారీబాగ్(జార్ఖండ్): హజారీబాగ్ జిల్లా కోర్టు ఆవరణలో మంగళవారం ఒక ముఠా నాయకుడిపై, అతని అనుచరులపై ప్రత్యర్థి ముఠా జరిపిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు. ఈ ఘటనలో ఇప్పటికే శిక్ష పడి జైల్లో ఉన్న నేరస్తుణ్ణి మరో కేసులో విచారణ కోసం కోర్టుకు తీసుకొచ్చినప్పుడు గుర్తు తెలియని దుండగులు ఆ నేరస్తుడితో పాటు మరో ఇద్దరు అనుచరులపై అనూహ్యంగా కాల్పులు జరపటంతో ముగ్గురూ అక్కడికక్కడే మరణించారని పోలీసులు తెలిపారు. పాత పగల వల్లే ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు.