సోలార్ స్కామ్ పై కేరళ అసెంబ్లీలో రగడ | Thiruvananthapuram: Opposition walk out from Kerala assembly over #solarscam issue | Sakshi
Sakshi News home page

సోలార్ స్కామ్ పై కేరళ అసెంబ్లీలో రగడ

Feb 5 2016 12:26 PM | Updated on Oct 22 2018 8:40 PM

కేరళ అసెంబ్లీ సమావేశాలను సోలార్ స్కాం పట్టి పీడిస్తోంది. సీఎం రాజీనామాకు పట్టుబడుతూ ప్రతిపక్ష ఎల్డీఎఫ్ సభ్యులు వాకౌట్ చేశారు.

తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ సమావేశాలకు సోలార్ స్కామ్ సెగ తాకింది. శుక్రవారం ప్రారంభమైన రాష్ట్ర అసెంబ్లీ సమాశాలకు ఆదిలోనే తీవ్ర ఆటంకం ఏర్పడింది. గవర్నర్ పి. సదాశివం ప్రసంగంతో మొదలు కావాల్సిన ఈ బడ్జెట్ సమావేశాల్లో గందరగోళం చెలరేగింది. గవర్నర్  ప్రసంగాన్ని విపక్ష సభ్యులు అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ రాజీనామా చేయాలనే నినాదాలతో  హోరెత్తించారు. 

చివరకు సభలో ప్రతిపక్ష నేత అచ్యుతానందన్ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవినీతి ఆరోపణలపై ఒక ప్రకటన  చేసేంతవరకు గవర్నర్ ప్రసంగం ప్రారంభం కాలేదు. అయినా సభ్యుల ఆగ్రహం చల్లారలేదు.  సీఎం రాజీనామాకు పట్టుబడుతూ ప్రతిపక్ష ఎల్డీఎఫ్ సభ్యులు వాకౌట్ చేశారు. అనంతరం ధర్నా నిర్వహించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement