
పేదలు ఉపాధి కోల్పోతున్నారు
నల్ల ధనం అరికట్టేందుకు పెద్ద నోట్ల రద్దు ఆలోచన బాగానే ఉన్నా పటిష్ట ప్రణాళిక లేకపోవడంతో సామాన్యులు తీవ్రంగా
వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వరప్రసాదరావు
సాక్షి, న్యూఢిల్లీ: నల్ల ధనం అరికట్టేందుకు పెద్ద నోట్ల రద్దు ఆలోచన బాగానే ఉన్నా పటిష్ట ప్రణాళిక లేకపోవడంతో సామాన్యులు తీవ్రంగా ఇక్కట్ల పాలవుతున్నారని, చివరకు రోజువారీ కూలిని కూడా కోల్పోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పాత నోట్లను రద్దు చేసినప్పుడు పటిష్ట ప్రణాళిక అవసరమనీ అది లోపించిందన్నారు.