ఉగ్రవాదాన్ని అంతంచేయాలి | Terrorism needs to be rooted out from all parts of world | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదాన్ని అంతంచేయాలి

Apr 12 2017 2:15 AM | Updated on Sep 5 2017 8:32 AM

ఉగ్రవాదాన్ని అంతంచేయాలి

ఉగ్రవాదాన్ని అంతంచేయాలి

ప్రపంచంలో పాతుకుపోయిన ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించాలని, అందుకు శాంతి కాముక దేశాలన్నీ తక్షణమే చర్యలు

ఆసిస్‌ ప్రధానితో భేటీ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్‌
న్యూఢిలీ: ప్రపంచంలో పాతుకుపోయిన ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించాలని, అందుకు శాంతి కాముక దేశాలన్నీ తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పిలుపునిచ్చారు. భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్‌ టర్న్‌బుల్‌ సోమవారం రాష్ట్రపతి భవన్‌లో ప్రణబ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ... ‘ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదం సమర్థించదగినది కాదనేది భారత్‌ అభిమతం. దీన్ని ఏ రూపంలో ఉన్నా సమగ్రమైన కార్యాచరణతో ప్రపంచంలోని శాంతికాముక దేశాలన్నీ కలసి తుదముట్టించాలి’అన్నారు. శిలాజ ఇంధన పొదువు, కాలుష్య రహిత ఇంధన వినియోగాన్ని విస్తరించడంలో భాగంగా అణు ఇంధన శక్తిని పెంచుకొనేందుకు భారత్‌ అడుగులు వేస్తోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement