పఠాన్కోట్లో హై అలర్ట్ | Terror alert in Pathankot, Gurdaspur | Sakshi
Sakshi News home page

పఠాన్కోట్లో హై అలర్ట్

Aug 20 2016 4:30 PM | Updated on Sep 4 2017 10:06 AM

పఠాన్కోట్లో హై అలర్ట్

పఠాన్కోట్లో హై అలర్ట్

ఉగ్రవాదులు మరోసారి పఠాన్కోట్, గురుదాస్ పూర్లను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.

పఠాన్కోట్: ఉగ్రవాదులు మరోసారి పంజాబ్ సరిహద్దు జిల్లాలు పఠాన్కోట్, గురుదాస్ పూర్లను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. నిఘా వర్గాలు వెల్లడించిన సమాచారం మేరకు ఈ రెండు జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా బటాలా పట్టణంలో శనివారం ఆర్మీ, బీఎస్ఎఫ్ సిబ్బంది భారీ ఎత్తున మోహరించి.. తనిఖీలు నిర్వహిస్తున్నారు. 
 
శుక్రవారం సాయంత్రం పాకిస్థాన్ నుంచి వచ్చిన ఓ ఫోన్ కాల్ను ట్రేస్ చేసిన నిఘా వర్గాలు ఉగ్రవాదులు భారీ ఎత్తున విధ్వంసానికి కుట్రపన్నినట్లు గుర్తించారు. ఉగ్రవాదుల కదలికలకు సంబంధించిన సమాచారం నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. జనవరి 2న పఠాన్‌కోట్ వైమానిక దళ స్థావరంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఏడుగురు జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement