విద్యార్థులు సరిగా చదవడంలేదని ఉపాధ్యాయురాలు కిరాతకంగా వ్యవహరించింది.
విద్యార్థులు సరిగా చదవడం లేదని...
Jun 11 2016 11:12 AM | Updated on Aug 20 2018 4:44 PM
చెన్నై: విద్యార్థులు సరిగా చదవడంలేదని ఉపాధ్యాయురాలు కిరాతకంగా వ్యవహరించింది. వారి కాళ్లపై కర్పూరం వెలిగించి కాల్చిన ఘటన తమిళనాడులోని విల్లాపురం లో చోటు చేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్న వైజయంతి మాల 15 మంది విద్యార్థులున్న తరగతిలో నలుగురు విద్యార్థులు సరిగా చదవడం లేదని వారిపై ఈ దురాగతానికి ఒడిగట్టింది. ఈమేరకు ఆమెపై జువైనిల్ జస్టిస్ చట్టం ప్రకారం కేసును నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా ఈనెల 24 వరకు ఆమెను కస్టడీలో ఉంచాల్సిందిగా కోర్టు ఆదేశించిందని జిల్లా ఎస్ పీ నరేంద్రకుమార్ తెలిపారు. మహిళా టీచరను, ప్రధానోపాధ్యాయున్ని సస్పెండ్ చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Advertisement
Advertisement