సీఎం నివాసంగా వేద నిలయం..

Tamil Nadu Government Looking At Converting Jayalalithaa House Into CM Residence - Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత నివాసమైన పోయెస్‌ గార్డెన్‌లోని‌ వేద నిలయాన్ని ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా మార్చేందకు పరిశీలిస్తున్నట్లు బుధవారం తమిళనాడు ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. జయలలిత నివాసాన్ని స్మారక చిహ్నంగా మారుస్తామన్న ప్రభుత్వ నిర్ణయంపై నివాసితుల సంఘం పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. ఈ విచారణ సందర్భంగా అడ్వకేట్‌ జనరల్‌ విజయ్‌ నారాయణ్‌ వేద నిలయాన్ని సీఎం నివాసంగా మార్చనున్నట్లు న్యాయమూర్తి జస్టిస్‌ ఆనంద్‌ వెంకటేష్‌కు తెలిపారు. వేదనిలయంలో ఎక్కువ భాగం స్మారకంగా కాకుండా రాష్ట్ర సీఎం అధికారిక నివాసంగా మార్చాలని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ చేసిన సూచనను పరిశీలిస్తున్నట్లు ఏజీ కోర్టుకు తెలిపారు. (వేదనిలయంలోకి దీపక్)

అదే విధంగా సోయెస్‌ గార్డెన్‌, కస్తూరి ఎస్టేట్‌ హౌజ్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను ఏజీ వ్యతిరేకించారు. వేద నిలయాన్ని స్మారకంగా మార్చడనికి అనుమతిస్తే వేల మంది సందర్శన వల్ల చుట్టూ ఉన్న ప్రజల ప్రశాంతతపై ప్రభావం పడుతుందని నివాసితుల సంఘం పేర్కొంది. పోయస్‌ గార్డెన్‌ను తాత్కలికంగా తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు తమిళనాడు ప్రభుత్వం మేలో ఆర్డినెన్స్‌ని జారీ చేసిన విషయం తెలిసిందే. (జయ ఆస్తిపై పూర్తి హక్కులు వారికే: మద్రాసు హైకోర్టు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top