రేపు సుప్రీంకోర్టులో యాకూబ్ పిటిషన్ విచారణ | supreme court will work on yakub petition on july 27 | Sakshi
Sakshi News home page

రేపు సుప్రీంకోర్టులో యాకూబ్ పిటిషన్ విచారణ

Jul 26 2015 5:36 PM | Updated on Sep 2 2018 5:24 PM

రేపు సుప్రీంకోర్టులో యాకూబ్ పిటిషన్ విచారణ - Sakshi

రేపు సుప్రీంకోర్టులో యాకూబ్ పిటిషన్ విచారణ

ముంబైలో 1993లో జరిగిన జంట బాంబు పేలుళ్ల సూత్రధారి యాకూబ్ మెమన్ పిటిషన్ పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది.

న్యూఢిల్లీ : ముంబై  బాంబు పేలుళ్ల కేసులో ఉరిశిక్ష పడిన యాకూబ్ మెమన్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. తన భర్త లొంగిపోయిన కారణంగా ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చాలంటూ యాకూబ్ భార్య రహీన్ విజ్ఞప్తి చేసింది.

ప్రస్తుతం మహారాష్ట్ర లోని నాగపూర్ జైల్లో యాకూబ్ ఉరిశిక్ష అమలుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 30న అతడికి ఉరిశిక్ష వేయాలని కోర్టు గతంలోనే తీర్పిచ్చిన విషయం తెలిసిందే. ఉరిశిక్షపై స్టే విధించాలంటూ యాకూబ్ మెమన్ దాఖలు చేసిన పిటిషన్పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement