ఆ ఆకుపచ్చ జెండాలపై బదులివ్వండి

Supreme Court seeks Centre's reply on Shia Waqf Board's plea against - Sakshi

న్యూఢిల్లీ: నెలవంక, నక్షత్రంతో కూడిన ఆకుపచ్చ రంగు జెండాలను దేశంలో ఎగరేయరాదంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. దేశవ్యాప్తంగా భవనాలు, మతపరమైన ప్రాంతాల్లో ఈ జెండాలను నిషేధించడంపై అభిప్రాయం చెప్పాలం టూ కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. ఆకుపచ్చ రంగు జెండాలపై షియా వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ సయ్యద్‌ వసీమ్‌ రిజ్వీ వేసిన పిటిషన్‌పై జస్టిస్‌ ఏకే సిక్రీ, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్రం తరఫున సమాధానం చెప్పేందుకు వీలుగా అదనపు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాకు ఈ పిటిషన్‌ కాపీని అందించాలని రిజ్వీకి ధర్మాసనం సూచించింది. నెలవంక, నక్షత్రంతో కూడిన ఆకుపచ్చ జెండాలు ‘‘ఇస్లాం విరుద్ధం’’ అని, అవి పాకిస్తాన్‌లోని ఓ రాజకీయ పార్టీ జెండాను తలపించేలా ఉన్నాయని రిజ్వీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top