వచ్చే లోక్‌సభ ఎన్నికల నుంచే దశలవారీగా ఈవీఎం నుంచి ఓటును ప్రింటవుట్ తీసుకునే విధానాన్ని అనుసరించాలని సుప్రీం కోర్టు మంగళవారం కేంద్రాన్ని ఆదేశించింది.
లోక్‌సభ ఎన్నికలతో దశలవారీగా అమలు చేయండి: సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల నుంచే దశలవారీగా ఈవీఎం నుంచి ఓటును ప్రింటవుట్ తీసుకునే విధానాన్ని అనుసరించాలని సుప్రీం కోర్టు మంగళవారం కేంద్రాన్ని ఆదేశించింది. ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా, పారదర్శకంగా జరగడానికి, ఫలితం కచ్చితంగా తెలుసుకోవడానికి ఇది అవసరమని కోర్టు వ్యాఖ్యానించింది. వోట్ వెరిఫికేషన్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ) అని వ్యవహరించే ఈ విధానాన్ని అమలు చేయడానికి అవసరమైన నిధులు వెంటనే మంజూరు చేయాలని చీఫ్ జస్టిస్ పి.సదాశివం, జస్టిస్ రంజన్ గొగోయ్‌లతో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది.