పోలవరంపై ఏపీ, కేంద్రానికి సుప్రీం నోటీసులు | Supreme Court Notice To AP And Central Governments On Polavaram | Sakshi
Sakshi News home page

పోలవరంపై ఏపీ, కేంద్రానికి సుప్రీం నోటీసులు

Aug 2 2018 3:17 PM | Updated on Sep 2 2018 5:36 PM

Supreme Court Notice To AP And Central Governments On Polavaram - Sakshi

సుప్రీం కోర్టు , పోలవరం ప్రాజెక్టు పనులు

సాక్షి, ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపడుతున్న పోలవరం ప్రాజెక్టుతో తమ రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుందంటూ ఒడిశా దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్‌, కేంద్ర ప్రభుత్వాలు మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సుప్రీం కోర్టు నోటీసులు జారీచేసింది. స్టాప్‌ వర్క్‌ ఆర్డర్‌ను నిలుపుదల చేయటాన్ని ఒడిశా ప్రభుత్వం సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో ఈ పిటిషన్‌ దాఖలు చేసింది. పోలవరం విచారణ అంశాలపై నివేదిక అందజేసేందుకు సుప్రీం కోర్టు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మరికొంత సమయాన్ని ఇచ్చింది. కాగా పోలవరం ప్రాజెక్టు వల్ల లక్షలాది మంది గిరిజనులు నిర్వాసితులవుతున్నారంటూ రేలా సంస్థ మరో పిటిషన్‌ దాఖలు చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement