తృటిలో తప్పించుకున్న వరుణ్ గాంధీ | Stage collapses ahead of Varun Gandhi's speech in UP | Sakshi
Sakshi News home page

తృటిలో తప్పించుకున్న వరుణ్ గాంధీ

Mar 13 2016 7:40 PM | Updated on Mar 29 2019 8:33 PM

తృటిలో తప్పించుకున్న వరుణ్ గాంధీ - Sakshi

తృటిలో తప్పించుకున్న వరుణ్ గాంధీ

బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.

మొరదాబాద్ (ఉత్తరప్రదేశ్) : బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఉత్తరప్రదేశ్ లో ఓ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆదివారం రైతులతో సమావేశమవడానికి వెళుతున్న వరుణ్.. మార్గమధ్యంలో మొరదాబాద్-హరిద్వార్ జాతీయ రహదారిలో తన కోసం వేచి ఉన్న మద్దతుదార్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ సమయంలో వరుణ్ ఉన్న వేదిక కూలిపోయింది.

వేదికపై వరుణ్ తో పాటు స్థానిక ఎంపీ సర్వేశ్ కుమార్, మొరదాబాద్ మేయర్ వీనా అగర్వాల్ ఉన్నారు. ప్రమాదంలో ఎవ్వరూ గాయపడలేదని మొరదాబాద్ ఏఎస్పీ యస్విర్ సిన్హా తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement