ఈ నల్లత్రాచు కాటేస్తే బతకడం కష్టం | snake kiran caught a king cobra enters into homes | Sakshi
Sakshi News home page

ఈ నల్లత్రాచు కాటేస్తే బతకడం కష్టం

Jul 4 2017 8:38 AM | Updated on Aug 20 2018 7:28 PM

ఈ నల్లత్రాచు కాటేస్తే బతకడం కష్టం - Sakshi

ఈ నల్లత్రాచు కాటేస్తే బతకడం కష్టం

కింగ్‌ కోబ్రా.. అదే నల్లత్రాచు. విషపూరిత పాముల్లోకెల్లా ఇది అతి పెద్దది.

జనావాసాల్లో కింగ్‌ కోబ్రా

శివమొగ్గ: కింగ్‌ కోబ్రా.. అదే నల్లత్రాచు. విషపూరిత పాముల్లోకెల్లా ఇది అతి పెద్దది. దీని విషం కూడా ఎక్కువే. కాటు వేస్తే బతకడం కష్టం. కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ కనుమల్లో మాత్రమే కనిపించే అరుదైన జాతి ఇది. ఇవి అప్పుడప్పుడు జనావాసాల్లో చొరబడుతూ కలకలం సృష్టిస్తుంటాయి. శివమొగ్గ జిల్లాలో ఇదే మాదిరి జరిగింది. శివమొగ్గ నగరంతో పాటు తీర్థహళ్ళి తాలూకాలో రెండు ప్రత్యేక ప్రాంతాల్లో  రెండు భారీ నల్ల త్రాచు పాములను స్నేక్‌ కిరణ్‌ పట్టుకుని అడవిలో వదలిపెట్టిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది.

శివమొగ్గ తాలూకా సమీపంలోని చోరడి గ్రామంలో ప్రాథమిక పాఠశాల ముందు జాతీయ రహదారి పక్కనే ఉన్న ఇంట్లోకి 12 అడుగుల పొడవైన కింగ్‌ కోబ్రా సర్పం చేరింది. భయాందోళనకు గురైన ఇంటి యçజమాని ఈ విషయాన్ని అటవీ అధికారులకు తెలియగా, వారు వచ్చినప్పటికీ పట్టుకోవడం సాధ్యం కాలేదు. దీంతో స్నేక్‌ కిరణ్‌కు సమాచారం ఇచ్చారు. దాంతో అక్కడికి చేరుకున్న స్నేక్‌ కిరణ్‌ సుమారు 45 నిమిషాల పాటు శోధించి లాఘవంగా పామును పట్టుకున్నారు. అటవీ అధికారులతో కలిసి దానిని తుప్పూరు అడవిలో వదిలేశారు.

తోటలో పాము
తీర్థహళ్ళి తాలూకాలోని మండగద్దె సమీపంలో ఉన్న కణగలసర గ్రామంలో ఉన్న సహన్‌సాబ్‌ అనే వ్యక్తి ఇంటి పక్కనున్న తోటలో సుమారు 7 అడుగుల నల్ల త్రాచు కనిపించింది. స్థానికుల సహకారంతో స్నేక్‌ కిరణ్‌కు తెలుపడంతో సంఘటన స్థలానికి వచ్చిన స్నేక్‌ కిరణ్‌ అర్దగంట పాటు శ్రమింర్దా సర్పాన్ని పట్టుకుని దగ్గరిలోని అడవుల్లో వదిలారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement