ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ పట్టణమైన వరంగల్‌ను ‘స్మార్ట్ సిటీ’గా తీర్చిదిద్దాలన్న వినతి తమకు అందిందని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కమల్‌నాథ్ గురువారం రాజ్యసభకు తెలిపారు.
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ పట్టణమైన వరంగల్‌ను ‘స్మార్ట్ సిటీ’గా తీర్చిదిద్దాలన్న వినతి తమకు అందిందని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కమల్‌నాథ్ గురువారం రాజ్యసభకు తెలిపారు. అయితే జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కింద ప్రస్తుత దశలో దీన్ని చేపట్టలేమని కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్దన్‌రెడ్డి ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా కమల్‌నాథ్ ఈ విషయం చెప్పారు.
కాగా, హైదరాబాద్ లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద 9.053 ఎకరాల స్థలంలో ఎయిర్‌ఫోర్స్ నావల్ హౌసింగ్ బోర్డు(ఎఎఫ్‌ఎన్‌హెచ్‌బీ) మూడోదశ గృహనిర్మాణ ప్రాజెక్టు 2006 చివరినాటికే పూర్తికావాల్సి ఉన్నా వివిధ కారణాల వల్ల 2012 డిసెంబర్ నాటికి కొలిక్కివచ్చిందని రక్షణ మంత్రి ఆంటోనీ.. పాల్వాయి అడిగిన మరో ప్రశ్నకు బదులిచ్చారు. కరీంనగర్ జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ అధికారుల బృందం గత జూన్‌లో రామగుండం మండలం పాలకుర్తిలో నిరుపయోగంగా ఉన్న ఎయిర్‌స్ట్రిప్‌ను పరిశీలించినట్లు విమానయానశాఖ సహాయమంత్రి కె.సి.వేణుగోపాల్ సమాధానం చెప్పారు.