ఛత్తీస్‌గఢ్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి | Six Maoists Died In Police Encounter In Bastar Region Chhattisgarh | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌గఢ్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి

Sep 15 2019 8:21 AM | Updated on Sep 15 2019 8:24 AM

Six Maoists Died In Police Encounter In Bastar Region Chhattisgarh - Sakshi

రాయ్‌పూర్‌/చర్ల: గత 24 గంటల్లో ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ ప్రాంతంలో జరిగిన వేర్వేరు ఎదురుకాల్పుల ఘటనల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. దంతెవాడ జిల్లా కిరండోల్‌ పరిధిలోని అటవీ ప్రాంతంలో శుక్రవారం రాత్రి డీఆర్‌జీ బలగాలు కూంబింగ్‌ జరుపుతుండగా తారసపడిన మావోలు కాల్పులకు దిగారు. ప్రతిగా పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోలు మృతి చెందారు. బిజాపూర్‌ జిల్లా ఆవుపల్లి అటవీ ప్రాంతంలో శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావో మృతి చెందాడు. సుక్మా జిల్లాలోని తాడ్‌మెట్ల–ముక్రంనల్లా గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో శనివారం జరిగిన  ఘటనలో ముగ్గురు మావోలు మృతి చెందారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement