సిస్టర్ నిర్మల కన్నుమూత | Sister Nirmala, who headed Missionaries of Charity after Mother Teresa, dies | Sakshi
Sakshi News home page

సిస్టర్ నిర్మల కన్నుమూత

Jun 23 2015 9:55 AM | Updated on Nov 6 2018 4:10 PM

సిస్టర్ నిర్మల కన్నుమూత - Sakshi

సిస్టర్ నిర్మల కన్నుమూత

సిస్టర్ నిర్మలా జోషి (81) మంగళవారం కన్నుమూశారు. మదర్ థెరిసా తర్వాత సిస్టర్ నిర్మల మిషనరీ ఆఫ్ ఛారిటీస్ బాధ్యతలు చేపట్టారు.

కోల్కతా:  సిస్టర్ నిర్మలా జోషి (81) మంగళవారం కన్నుమూశారు. మదర్ థెరిస్సా తర్వాత సిస్టర్ నిర్మల మిషనరీ ఆఫ్ ఛారిటీస్ బాధ్యతలు చేపట్టారు. మదర్ థెరెస్సా నెలకొల్పిన  మిషనరీ ఆఫ్ ఛారిటీస్ బాధ్యతలను సిస్టర్ నిర్మల 1997-2009 మధ్య బాధ్యతలు  నిర్వహించారు.  సిస్టర్ సేవలకు గుర్తింపుగా  2009లో ఆమెకు కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. కాగా సిస్టర్ నిర్మల మృతి పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం తెలిపారు. సిస్టర్ నిర్మల మృతి ప్రపంచానికి తీరని లోటు అని ఆమె తన ట్విట్టర్లో పేర్కొన్నారు.

 సిస్టర్ నిర్మల 1934, జూలై 23న రాంచీలో జన్మించారు.  ఆమె తల్లిదండ్రులు నేపాల్కు చెందిన హిందూ జాతీయులు.  పాట్నాలోని క్రిస్టియన్ మిషనరీలో సిస్టర్ నిర్మల తన విద్యాభ్యాసం చేశారు. ఆ సమయంలో మదర్ థెరిస్సా సేవాభావం నచ్చి తన 17వ ఏటానే రోమన్ క్యాథలిక్లోకి మారిపోయారు. అనంతరం అనంతరం మదర్ థెరిస్సా స్థాపించిన మిషనరీ ఆఫ్ ఛారిటీస్‌లో చేరి తన సేవలను అందించారు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement