హిందీని రుద్దితే ఊరుకోం : సిద్ధరామయ్య

Siddaramaiah says Imposition Of Hindi Nothing But A Brutal Assault  - Sakshi

బెంగళూర్‌ : హిందీయేతర రాష్ట్రాల్లో హిందీని తప్పనిసరిగా బోధించాలన్న ప్రతిపాదనపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏదైనా భాషను నేర్చుకోవడం విద్యార్ధుల ఎంపిక అని, దాన్ని బలవంతంగా రుద్దకూడదని ఆయన హితవు పలికారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మన సమాజంలో శాంతియుత సహజీవనం అవసరమని, బలవంతంగా ఏమైనా చేయాలని చూడటం సమాజ నిబంధనలకు విరుద్ధమని సిద్ధరామయ్య వరుస ట్వీట్లలో పేర్కొన్నారు.

కన్నడ ప్రజలుగా తాము ఇతర భాషలను నేర్చుకోవడం స్వచ్ఛందంగా జరగాలని, బలవంతంగా తమపై ఏ భాషనూ రుద్దడం తగదని హితవు పలికారు. ప్రాంతీయ గుర్తింపు కలిగిన రాష్ట్రాలపై ఇతర భాషలను రుద్దడం పాశవిక దాడేనని ఆయన అభివర్ణించారు. మరోవైపు త్రిబాష ఫార్ములా పేరుతో ఓ బాషను ఇతర రాష్ట్రాలపై రుద్దరాదని కర్నాటక సీఎం హెచ్‌డీ కుమారస్వామి కేంద్రాన్ని ఆక్షేపించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top