
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు చేదు అనుభవం ఎదురైంది. గురువారం ఆయన ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతుండగా ఒక వ్యక్తి ఆయనపైకి రెండు బూట్లు విసిరాడు. మొదటి బూటు జీవీఎల్‌కు దూరంగా వెళ్లగా.. రెండోది ఆయనకు అతి సమీపం నుంచి వెళ్లింది.
ఈ ఘటనతో జీవీఎల్ షాకయ్యారు. అప్రమత్తమైన పార్టీ కార్యాలయ సిబ్బంది బూటు విసిరిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. సదరు వ్యక్తి యూపీలోని కాన్పూర్‌కు చెందిన వైద్యుడు శక్తి భార్గవగా గుర్తించారు. అతను ఒక ఆస్పత్రి నడుపుతున్నట్టు విజిటింగ్ కార్డు లభ్యమైంది. దాడికి కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు.దీనిపై స్పందించిన జీవీఎల్ ఇలాం టి దాడులకు తాను భయపడబోనని అన్నారు.