రెండేళ్ళ పాప గొంతు పిసికి .. | Shocking! 15-year-old murders 2-year-old in cold blood in Delhi | Sakshi
Sakshi News home page

రెండేళ్ళ పాప గొంతు పిసికి ..

Jun 18 2015 4:23 PM | Updated on Aug 11 2018 8:48 PM

రెండేళ్ళ పాప గొంతు పిసికి .. - Sakshi

రెండేళ్ళ పాప గొంతు పిసికి ..

పదిహేనేళ్ల మైనర్ బాలిక రెండేళ్ల పసిపాపను దారుణంగా హత్య చేసిన ఘటన న్యూఢిల్లీలోని కళ్యాణపురిలో కలకలం రేపింది.

న్యూఢిల్లీ: పదిహేనేళ్ల మైనర్ బాలిక రెండేళ్ల పసిపాపను దారుణంగా హత్య చేసిన ఘటన న్యూఢిల్లీలోని కళ్యాణపురిలో కలకలం రేపింది.  జూన్ 10న అదృశ్యమై, శవంగా మారిన రెండేళ్ల పాప కేసును ఛేదించిన పోలీసులు వివరాలను మీడియాకు తెలిపారు. పాప అదృశ్యమైందన్న ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులకు దాదాపు మూడు రోజుల తర్వాత   ప్లాస్టిక్ సంచిలో్ పాప శవం కనిపించడంతో షాకయ్యారు. ఈ కేసును సవాల్గా స్వీకరించారు. స్పెషల్ టాస్క్  ఫోర్స్ ఆధ్వర్యంలో దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఓ అమ్మాయి అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. విచారణలో ముందు తనకే పాపం తెలియదని బుకాయించినా చివరికి నేరాన్ని అంగీకరించింది.

పాప తల్లితో జరిగిన చిన్న ఘర్షణ బాలికను ఉన్మాదిగా మార్చివేసింది. పాప ఒంటరిగా ఆడుకుంటున్న సమయంలో ఎత్తుకుపోయి,  గొంతు నులిమి చంపేసింది.  అనంతరం ఆ రోజు సాయంత్రం ఒక ప్లాస్టిక్ కవర్లో పాప శవాన్ని చుట్టి సంజయ్ లేక్ ఏరియాలో పడేసింది.   
నిందితురాలు మైనర్ కావడంతో జువైనల్ హోం చట్టం ప్రకారం మహిళా పోలీస్ స్టేషన్కు  కేసును అప్పగించామని  కళ్యాణ్ పురి పోలీస్ అధికారి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement