శశికళకు ఎదురుదెబ్బ | shock to sasikala didnt get parole | Sakshi
Sakshi News home page

శశికళకు ఎదురుదెబ్బ

Oct 3 2017 7:35 PM | Updated on Oct 3 2017 8:36 PM

 shock to sasikala didnt get parole

బెంగళూరు : శశికళకు ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమెకు పెరోల్‌ ఇచ్చేందుకు జైలు శాఖ నిరాకరించింది. అనారోగ్యంతో ఉన్న తన భర్తను చూసేందుకు తనకు పదిహేను రోజులు పెరోల్‌ ఇవ్వాలని శశికళ దరఖాస్తు చేసుకున్నారు.

ఈ విషయం ఏఐఏడీఎంకే నేత టీటీవీ దినకరన్‌ చెప్పారు. చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో శశికళ భర్త ఎం నటరాజన్‌ చికిత్స పొందుతున్న విషయం విదితమే. లివర్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో ఉన్న నటరాజన్‌కు ప్రస్తుతం డయాలసిస్‌, ఇతర ఇంటెన్సివ్‌ కేర్‌ థెరఫీస్‌ను వైద్యులు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శశికళ పెరోల్‌కు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. అయితే, ఆమెకు పెరోల్‌ కూడా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ అటు శశికళకు, దినకరన్‌కు నిరాశ ఎదురైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement