షిర్డీ విమానాశ్రయానికి పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) గురువారం లైసెన్స్ జారీ చేయడంతో త్వరలో విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
ఇక షిర్డీకి విమాన రాకపోకలు
Sep 21 2017 6:46 PM | Updated on Sep 22 2017 10:02 AM
సాక్షి,న్యూఢిల్లీః షిర్డీ సాయిబాబాను దర్శించుకునే భక్తులు ఇక నేరుగా విమానాల్లో షిర్డీ చేరుకోవచ్చు. షిర్డీ విమానాశ్రయానికి పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) గురువారం లైసెన్స్ జారీ చేయడంతో త్వరలో విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
షిర్డీ ఎయిర్‌పోర్ట్‌లో ఏ-320, బోయింగ్ 737 ఎయిర్‌క్రాఫ్ట్‌ల రాకపోకలకు వీలు కల్పించేలా అత్యంత పొడవైన రన్‌వేను నిర్మించారు. విమానాశ్రయంలో అన్ని ప్రమాణాలు, వసతులను పరిశీలించిన అనంతరం షిర్డీ ఎయిర్‌పోర్ట్ ప్రయాణీకుల వినియోగానికి అవసరమైన ఏరోడ్రోమ్ లైసెన్స్‌ను జారీ చేశామని డీజీసీఏ సీనియర్ అధికారి వెల్లడించారు.
Advertisement
Advertisement