
సీపీఐ సీనియర్ నేత ఏబీ బర్దన్ కన్నుమూత
సీపీఐ సీనియర్ నేత అర్ధేందు భూషణ్ బర్ధన్ (92) సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు.
ఢిల్లీ: సీపీఐ సీనియర్ నేత అర్ధేందు భూషణ్ బర్ధన్ (92) శనివారం కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు తొలుత జీబీ పంత్ ఆస్పత్రిలోను, తర్వాత రాం మనోహర్ లోహియా ఆస్పత్రిలోను చికిత్స అందించారు. శనివారం ఆయన కన్నుమూసినట్టుగా సీసీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా వెల్లడించారు.
అయితే పెద్ద వయసు కావడంతో చికిత్సకు శరీరం సహకరించలేదు. బర్దన్ పక్షవాతంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. 1996-2012 సంవత్సరాల మధ్య సీపీఐకి జాతీయ కార్యదర్శిగా బర్దన్ పనిచేశారు. ప్రస్తుత బంగ్లాదేశ్‌లోని బరిసల్ అనే ప్రాంతంలో ఆయన 1924 సెప్టెంబర్ 24న బర్దన్ జన్మించారు.