 
															కూతుర్ని చంపి పార్టీ చేసుకున్నారట!
													 
										
					
					
					
																							
											
						 సీబీఐ విచారణలో భాగంగా  సంజీవ్ ఖన్నా స్నేహతుడు , వ్యాపార వేత్త మంగలేష్ జలన్ (60)  షీనా హత్య తరువాత కోలకత్తాలో్ని ఒక  ప్రముఖ క్లబ్ లో ఇద్దరూ  పార్టీ చేసుకున్నారని తెలిపారు.
						 
										
					
					
																
	
		ముంబై:  సంచలనం  సృష్టించిన షీనా బోరా హత్య కేసులో మరిన్ని  దిగ్ర్భాంతికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. సీబీఐ విచారణలో భాగంగా  సంజీవ్ ఖన్నా స్నేహతుడు, వ్యాపారవేత్త మంగలేష్ జలన్ (60)ను  ప్రశ్నించారు. ఈ క్రమంలో షీనా హత్య తరువాత, ఆమె మృతదేహాన్ని ముంబైకి తరలించే ముందు కోలకత్తాలో్ని ఒక ప్రముఖ క్లబ్ లో మందు పార్టీ చేసుకున్నారని తెలిపారు. సీబీఐకి సమర్పించిన చేతిరాతలో ఉన్న ఒక పేజీ  రిపోర్టులో ఆయన కీలకమైన విషయాలను వెల్లడించారు.
	
		 
	
		షీనా హత్య తరువాత ఇంద్రాణి, సంజీవ్ ఖన్నా ఏప్రిల్  25న కోలకత్తా క్రికెట్ అండ్ ఫుట్బాల్ క్లబ్ లో పార్టీ చేసుకుంటూ చాలా ఉత్సాహంగా కనిపించారన్నారు. ఇద్దరూ మద్యం తాగుతూ కులాసాగా, సంతోషంగా ఉండడడాన్నిగమనించిన తాను ఖన్నాను  ప్రశ్నించానన్నారు. ముంబైలో ఉన్న తన  కూతురు విధిని చూడ్డానికి వెళుతున్నానంటూ ఖన్నా ఉత్సాహంగా చెప్పారన్నారు. సీసీ అండ్ ఎఫ్సీ లో చాలా  సీనియర్ సభ్యుడైన ఖన్నా  తనకు 30 ఏళ్లుగా తెలుసనన్నారు. కానీ ఇంద్రాణితో తనకు పెద్దగా పరిచయంలేదని జలన్ సీబీఐతో చెప్పారు.  
	
		 
	
		కాగా షీనా హత్య కేసులో ప్రధాన నిందితురాలు, ఆమె తల్లి ఇంద్రాణి, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ లను సీబీఐ ఇప్పటికే అదుపులోకి తీసుకుంది. అనంతరం ఇంద్రాణి ప్రస్తుత భర్త పీటర్ ముఖర్జియాను కూడా నిందితునిగా పేర్కొంటూ రిమాండ్ చేసింది. తల్లీకూతుళ్ల మధ్య తగాదాలు, బెదిరింపులు, ఆస్తి వివాదాలు, రాహుల్‌తో ప్రేమ వ్యవహారం నచ్చని ఇంద్రాణి ముఖర్జీ.. షీనా హత్యకు పథకం వేసిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన సీబీఐ విచారణను మరింత వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో సంజీవ్ ఖన్నా స్నేహితుడును జలన్ కూడా విచారించింది. ఆయన ఇచ్చిన కీలక సమాచారంతో్ షీనాబోరా హత్య కేసును ఒక కొలిక్కి తెచ్చేందుకు సీబీఐ ప్రయత్నిస్తోంది.
	 
 
					
					
					
						