దేశంలో పొంచి ఉన్న ఉప్పు కొరత! | Salt shortage looms large as huge stock piles up in units | Sakshi
Sakshi News home page

దేశంలో పొంచి ఉన్న ఉప్పు కొరత!

Jul 8 2018 2:54 AM | Updated on Jul 8 2018 2:55 AM

Salt shortage looms large as huge stock piles up in units - Sakshi

రాజ్‌కోట్‌: గుజరాత్‌లోని కచ్‌లో సుమారు 8 లక్షల టన్నుల ఉప్పు నిల్వలు పేరుకుపోయాయి. వాటిని ఇతర ప్రాంతాలకు తరలించేందుకు తగిన రవాణా సదుపాయాలు లేకపోవడంతో దేశవ్యాప్తంగా ఉప్పు కొరత ఏర్పడే అవకాశాలున్నాయి. ఖరీఫ్‌ సీజన్‌ కావడంతో గుజరాత్‌ తీర ప్రాంతాల నుంచి ఎరువుల సరఫరాకే రైల్వే శాఖ ప్రాధాన్యమిస్తోంది. దీంతో ఉప్పు తరలింపు నిలిచిపోయింది.

గుజరాత్‌లోని మొత్తం 20 ఉప్పు శుద్ధి కేంద్రాల్లో 14 కచ్‌లోని గాంధీదామ్‌లో ఉన్నాయి. కాండ్లా, ముంద్రా, టునా పోర్టుల్లో సుమారు 17 లక్షల టన్నుల ఎరువులను దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలించాల్సి ఉన్నందున, ఉప్పుకు రైలు బోగీల కొరత ఏర్పడింది. దీంతో మరో మార్గం లేక ఉప్పు తయారీదారులు తమ సరుకును విదేశాలకు ఎగుమతి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement