రూ.10 నాణేలు తీసుకోకుంటే ఫోన్‌ చేయండి | Sakshi
Sakshi News home page

రూ.10 నాణేలు తీసుకోకుంటే ఫోన్‌ చేయండి

Published Fri, Nov 17 2017 6:33 PM

Rs 10 coin legal tender: RBI - Sakshi

సాక్షి, చెన్నై‌: పది రూపాయల నాణేలు చట్ట ప్రకారం చెల్లుతాయని భారత రిజర్వు బ్యాంక్‌(ఆర్‌బీఐ) వెల్లడించింది. వాడుకలో ఉన్న రూ.10 నాణేలు ప్రస్తుతం కొద్దిగా మార్పులు చేసి తయారు చేస్తున్నారు. ముందుగా వాడుకలో ఉన్న రూ.10 నాణేల నుంచి అవి కొంచెం మార్పు కలిగినా అన్నీ చట్ట ప్రకారం చెల్లుతాయని ఆర్‌బీఐ తెలిపింది. రూ.10 నాణేలు చెల్లవని దేశవ్యాప్తంగా వదంతులు వ్యాపించడంతో చాలా మంది వీటిని తీసుకోవడానికి వెనుకంజ వేస్తుండటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు.

ఈ వదంతులను నమ్మవద్దని రిజర్వు బ్యాంక్‌ తరచూ ప్రచారం చేస్తూ వస్తుంది. రూ.10 నాణేలు చట్టప్రకారం చెల్లుతాయని తాజాగా మరోసారి ఆర్‌బీఐ స్పష్టం చేసింది. కొత్త, పాత రూ.10 నాణేలు వాడుకలో ఉన్నాయని రూ.10 నాణేలను తీసుకోవడానికి అంగీకరించని వారి గురించి 044–25399222 నెంబర్‌కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయవచ్చని రిజర్వు బ్యాంక్‌ కార్యాలయం ప్రకటించింది.

Advertisement
Advertisement