సీఎం వద్దకు వెళుతూ బీజేపీ ఎమ్మెల్యే మృతి | Road mishap: Deceased MLA's PA also succumbs to injuries | Sakshi
Sakshi News home page

సీఎం వద్దకు వెళుతూ బీజేపీ ఎమ్మెల్యే మృతి

Jun 10 2016 1:21 PM | Updated on Mar 29 2019 8:30 PM

సీఎం వద్దకు వెళుతూ బీజేపీ ఎమ్మెల్యే మృతి - Sakshi

సీఎం వద్దకు వెళుతూ బీజేపీ ఎమ్మెల్యే మృతి

మధ్యప్రదేశ్లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో బీజేపీ ఎమ్మెల్యే ప్రాణాలు కోల్పోయారు. ఆయన పీఏ కూడా తీవ్ర గాయాలతో మృతిచెందినట్లు పోలీసులు చెప్పారు.

భోపాల్: మధ్యప్రదేశ్లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో బీజేపీ ఎమ్మెల్యే ప్రాణాలు కోల్పోయారు. ఆయన పీఏ కూడా తీవ్ర గాయాలతో మృతిచెందినట్లు పోలీసులు చెప్పారు. ఇండోర్-భోపాల్ రోడ్డులో నేపానగర్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజేంద్ర దాదు గురువారం రాత్రి వెళుతుండగా ప్రముఖ పట్టణాలు ఆస్తా-సిహోర్ మధ్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే రాజేంద్ర అక్కడికక్కడే చనిపోగా.. ఆయన పీఏ రవింద్ర ఆత్రే తొలుత తీవ్ర గాయాలు పాలవడంతో ఆస్పత్రికి తరలించారు.

అయినప్పటికీ గాయాల తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా శుక్రవారం ఉదయం చనిపోయాడు. మరో ఇద్దరు గాయలతో చికిత్స పొందుతున్నారు. శనివారం జరగనున్న రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇంట్లో జరుగుతున్న పార్టీ సమావేశానికి హాజరయ్యేందుకు నేపానగర్ నుంచి భోపాల్ వస్తుండగా రాజేంద్ర ఈ ప్రమాదానికి గురయ్యారు. అతి వేగంతో వస్తున్న కారు బోల్తా పడటం వల్లే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆయన మృతిపట్ల కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి శివరాజ్ సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement