దేశవిదేశాల్లో స్వేచ్ఛా గీతిక | Restrictions At Some Areas In Kashmir On Independence Day | Sakshi
Sakshi News home page

దేశవిదేశాల్లో స్వేచ్ఛా గీతిక

Aug 16 2017 12:48 AM | Updated on Jul 30 2018 8:14 PM

దేశవిదేశాల్లో స్వేచ్ఛా గీతిక - Sakshi

దేశవిదేశాల్లో స్వేచ్ఛా గీతిక

మువ్వన్నెలు రెపరెపలాడాయి. మహాత్ములను స్మరిస్తూ... వారి త్యాగాలను కీర్తిస్తూ... గుండెలు ఉప్పొంగాయి.

ఘనంగా 71వ స్వాతంత్య్ర వేడుకలు
న్యూఢిల్లీ/బీజింగ్‌/మెల్‌బోర్న్‌:
మువ్వన్నెలు రెపరెపలాడాయి. మహాత్ములను స్మరిస్తూ... వారి త్యాగాలను కీర్తిస్తూ... గుండెలు ఉప్పొంగాయి. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటు తూ దేశంలోనే కాదు... విదేశీ గడ్డపైనా భారత 71వ స్వాతంత్య్ర వేడుకలు మిన్నం టాయి. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలు ఉత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.

అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు జాతీయ పతాకాన్ని ఎగురవేసి ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. అభివృద్ధి పథకాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రకటించారు. జమ్మూ కశ్మీర్‌ను భారత్‌కు కిరీటంలా దేశ ప్రజలంతా విశ్వసిస్తారని, ఎప్పటికీ తమ రాష్ట్రం అలానే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదని సీఎం ముఫ్తీ స్పష్టం చేశారు.

పట్నాయక్‌కు అస్వస్థత: మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో వేడుకల వేదికల వద్ద రుణమాఫీ చేయాలంటూ రైతులు నిరసనలు తెలిపారు. పతాక ఆవిష్కరణలకు అంతరాయం కలిగించారు. ఒడిశా ఉత్సవా ల్లో ప్రసంగిస్తుండగా సీఎం నవీన్‌ పట్నాయక్‌ హఠాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. అయినా జెండా వందనం అయ్యే వరకు ఉండి, తరువాత అక్కడి నుంచి వెళ్లిపో యారు. ఆయన ఆరోగ్యం స్థిరంగానే ఉందని అనంతరం అధికారులు ప్రకటించారు.

విదేశీ గడ్డపై భారతీయం
ప్రపంచం నలుమూలలా ఉన్న వేలాది మంది భారతీయులు స్వాతంత్య్ర సంబరాల్లో మునిగిపోయారు. మువ్వన్నెల జెండాలు చేతపట్టి... జాతీయ గీతాలు ఆలపించి భారత మాతకు జేజేలు పలికారు. చైనా, ఆస్ట్రేలియా, జపాన్, సింగపూర్, సౌదీ, బ్రిటన్, ఈజిప్ట్, ఇజ్రాయెల్, దక్షిణాఫ్రికాల్లో ఘనంగా వేడుకలు జరుపుకున్నారు.

ఆస్ట్రేలియాలోని భారతీయులకు ఆ దేశ ప్రధాని మాల్కమ్‌ టర్న్‌బుల్‌ శుభాకాంక్షలు చెప్పారు. జపాన్‌ ప్రముఖులు భారతీయు లకు అక్కడి వార్తాపత్రికల ద్వారా శుభాకాం క్షలు తెలిపారు. బ్రిటన్‌లోని భారతీయులు చారిత్రక పార్లమెంట్‌ స్క్వేర్‌ నుంచి తొలి సారిగా ఫ్రీడమ్‌ రన్‌ చేపట్టారు. దక్షిణా ఫ్రికా లోని ప్రిటోరియా, డర్బన్, కేప్‌టౌన్, జోహ న్నెస్‌బర్గ్‌ల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ స్వాతంత్య్ర సందేశాన్ని వినిపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement