ఈశ్వరప్ప భార్యను నేను రేప్ చేస్తే ఆయన ఏం చేయగలడు?
మంగళూరు: సభ్యసమాజం సిగ్గుతో తలొంచుకునే రీతిలో కర్ణాటకలో చిన్నారులపై అత్యాచారాల కేసులు నమోదవుతుండగా, మరోవైపు రాజకీయ నేతల దిగజారుడు వ్యాఖ్యలు మరింత వికతరూపం దాల్చాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హోం మంత్రి కేజే జార్జి కుమార్తెలపై అత్యాచారం జరిగితేగానీ వాళ్లకు సమస్య తీవ్రత ఏమిటో తెలిసొచ్చే అవకాశం లే దంటూ బీజేపీ నేత ఈశ్వరప్ప చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై, స్పందిస్తూ ఇవాన్ డిసౌజా అనే నామినేటెడ్ ఎమ్మెల్సీ మరింతగా దిగజారుడు మాటలతో వికృతంగా ప్రవర్తించారు.
‘శాసనమండలిలో ప్రతిపక్షనేత హోదాలో ఉన్న మనిషి అలా మాట్లాడ్డమేమిటి? ఆయన ఎప్పుడూ సభను కూడా సరిగా జరగనిచ్చే రకంకాదు. గతంలో మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా చేసిన ఆయనంటే నాకు గౌరవం ఉంది. అయితే మండలిలో ఆయనలాంటి వ్యక్తి ప్రతిపక్ష నేత అని చెప్పుకోడానికే నాకు సిగ్గుగా ఉంది. నోరు అదుపులో పెట్టుకోవడం ఆయన నేర్చుకోవాలి.
సీఎం కుమార్తె, హోంమంత్రి కుమార్తెలపై అత్యాచారం అంటాడేమిటి? అసలు ఈశ్వరప్ప భార్యను నేను రేప్ చేస్తే ఆయన ఏం చేయగలడు? ఆయన స్పందనేమిటి? ఆయనలా మాట్లాడడ్డం రాజకీయాల్లో సరైన సంస్కతి కానేకాదు.’ అంటూ విపరీత వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన మాటలను మీడియా, పార్టీ నేతలు కూడా తప్పుబట్టేసరికి డిసౌజా తమాయించుకొని ఈశ్వరప్పకు క్షమాపణ చెప్పేశారు.