నూతన కాగ్‌గా రాజీవ్‌ మహర్షి | Rajiv Mehrishi as new cog | Sakshi
Sakshi News home page

నూతన కాగ్‌గా రాజీవ్‌ మహర్షి

Sep 25 2017 3:17 AM | Updated on Sep 25 2017 7:36 AM

Rajiv Mehrishi as new cog

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ హోం కార్యదర్శి రాజీవ్‌ మహర్షి(62)ని తదుపరి కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌)గా కేంద్రం నియమించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. రాష్ట్రపతి భవన్‌లో సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మహర్షి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారన్నారు. 1978 బ్యాచ్, రాజస్తాన్‌ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన మహర్షి కాగ్‌గా ఆరేళ్ల పాటు లేదా 65 ఏళ్లు పూర్తయ్యేవరకు కొనసాగుతారు. హోంశాఖ కార్యదర్శిగా రెండేళ్ల పదవీకాలాన్ని ఆగస్టుతో పూర్తిచేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement