
సాక్షి, చెన్నై: సూపర్‌స్టార్ రజనీ కాంత్ నేటి నుండి ఈ నెల 31 వరకూ తన అభిమానులతో భేటీ కానున్నారు. కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ అభిమానులతో రజనీ సమావేశమవుతారు. ఈ నెల 12న జరిగిన 68వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా రజనీ రాజకీయ ఆరంగేట్రంపై ప్రకటన చేస్తారని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. అయితే మంగళవారం నుంచి అభిమానులతో రజనీ సమావేశమవుతున్న నేపథ్యంలో ఆయన రాజకీయ ప్రవేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.