రైళ్లలో క్రెడిట్, డెబిట్‌ కార్డులతో ఫుడ్‌ | Sakshi
Sakshi News home page

రైళ్లలో క్రెడిట్, డెబిట్‌ కార్డులతో ఫుడ్‌

Published Sat, Jan 26 2019 5:19 AM

Railway Passengers Will Be Able To For Food Via Credit And Debit cards - Sakshi

న్యూఢిల్లీ: రైళ్లలో ఆహార బిల్లుల్ని చెల్లించేందుకు 2,191 పీఓఎస్‌ (పాయింట్‌ ఆఫ్‌ సేల్‌) మెషీన్లను ఐఆర్‌సీటీసీ ప్రవేశపెట్టింది. రైలు ప్రయాణికులు ఈ మెషీన్ల వద్ద తమ క్రెడిట్, డెబిట్‌ కార్డులను ఉపయోగించి ఆహార బిల్లులను చెల్లించవచ్చు. ప్యాంట్రీకార్లున్న రైళ్లలో పీఓఎస్‌ మెషీన్లను ప్రయాణికులకు అందుబాటులో ఉంచినట్లు రైల్వే శాఖ తెలిపింది. రైళ్లలో ఆహార పదార్థాలు కొనేటప్పుడు విక్రేతలు ప్రయాణికుల నుంచి అధికమొత్తాన్ని వసూలు చేయకుండా అరికట్టేందుకు ఈ మెషీన్లు ఉపయోగపడతాయని తెలిపింది. ఎక్స్‌ప్రెస్, మెయిల్‌ రైళ్లల్లో జనవరి 26 నుంచి ఫిబ్రవరి 15వరకు పీఓఎస్‌ మెషీన్ల పనితీరు, ఆహారపదార్థాల కొనుగోలుపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తామని పేర్కొంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement